Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన గాంధీ విగ్రహం ఏర్పాటు అవాస్తవం
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట
మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది వాస్తవం కాదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రామకృష్ణతో కలిసి ఆలయ అధికారులు, కమిటీ సభ్యులతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించా ల్సిన సౌకర్యాలపై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు చేస్తున్న ప్రచారం తప్పు అన్నారు. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకోను న్నట్టు తెలిపారు. అమ్మవారిని అడ్డం పెట్టుకుని రాజకీ యాలు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణి ంచారు. భక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయ త్నించే వారి విషయాన్ని ఆ అమ్మవారే చూసుకుంటార న్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి అబాసుపాలు కావద్దని హితవు పలికారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రయివేట్ ఆలయాలకు కూడా నిధులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
గాంధీ విగ్రహం పరిసరాల అభివృద్ధి..
సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం పరిసరాలను ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా తీర్చిదిద్దను న్నట్టు మంత్రి తలసాని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను తొడుపునూరి అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్, తిరుమల్ గౌడ్, చందు, రాందాస్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్‌తో కలిసి పరిశీలించారు. 70 ఏండ్ల క్రితం అప్పటి ప్యారడైజ్ హౌటల్ యజమాని తొడుపునూరి అంజయ్య గౌడ్ ఇటలీ నుంచి పంచలోహాలతో చేయించిన గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అనీ, అలాంటి మహానుభావుడి జయంతి, వర్ధంతిల సమయంలో నివాళులు అర్పించడమే కాకుండా ఎంతో చరిత్ర గల ఈ విగ్రహం వద్దకు వచ్చే వారికి ఆహ్లాదక రమైన వాతావరణం కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అందులో భాగంగా ఫౌంటెన్, రెయిలింగ్, కూర్చునేందుకు వీలుగా గాజిబో షెడ్స్, లైటింగ్, టాయిలెట్స్ నిర్మాణంతోపాటు గార్డెనింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నూతన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనీ, పరిసరాలను మాత్రమే సుందరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.