Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పనిచేసే ప్రదేశంలో కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటించాలని గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధి లోని చంద్రగిరినగర్‌లో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాల అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. తాగునీరు, మురుగునీటి నిర్వహణలో బాధ్య తలు నిర్వహిస్తున్న కార్మికులు పని చేసే ప్రదేశంలో బారికే డింగ్, సెఫ్టీగ్రిల్స్ ఏర్పాటు, సిల్డ్ గ్రాబర్ల వినియోగం, హెడ్ లైట్స్‌తో కూడిన హెల్మెట్, గమ్ బూట్లు, మాస్కులు, వాటర్ ఫ్రూవ్ దుస్తులు తప్పని సరిగా ఉపయోగించాల న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి నవా బ్, నాయకులు కూరపాటి కరుణాక ర్రాజు, సమ్మయ్య యాదవ్, చిన్నగౌడ్, నర్సింహా, ఉదరు పాల్గొన్నారు.
బేగంపేట్ : పని చేసే ప్రదేశంలో కార్మికులు భద్రతా ప్ర మాణాలు తప్పనిసరిగా పాటించాలని జలమండలి అధి కారి రమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జలమండలి అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది భద్రతా ప్రమాణాలపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జలమండలి అధికారులు శశాంక్, సంధ్య, జీహెచ్ ఎంసీ అధికారులు, డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి, శానిటేషన్ అధికారి పవన్, ఇంజినీరింగ్ ఏఈ సాయి, తదితరులు పాల్గొన్నారు.