Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
'మా ఇష్టం సినిమా షూటింగ్ టైమ్‌లో సినిమా నటీ మణులు కాంత్రి, కరుణ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆరోపించారు. ఈ మేరకు శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. క్రాంతి, కరుణ 202 నవంబర్ 30న తన లెటర్ ప్యాడ్ తీసుకున్నారనీ, ఆ తర్వాత సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు తాను వారికి డబ్బులు చెల్లించాల్సి ఉన్నట్టుగా నకిలీ పత్రాలను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి వాస్తవాలను తేల్చాలని కోరారు. నఖిలీ పత్రాలు సృష్టిండం, కేసులు వేయడం ద్వారా తన సినిమా విడుదలను అడ్డుకోలేరని రాంగోపాల్‌వర్మ తెెలిపారు.