Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో పీహెచ్సీల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రారంభించామని కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ తెలిపారు. శనివారం ఇసామియ బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కింగ్ కోఠి క్లస్టర్ పరిధిలోని 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 53 రకాల వ్యాధులకు ఈ ఆరోగ్య శ్రీ కింద రోగులకు వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద వైద్య సాయం పొందాలనుకునే రోగులు వారి వెంట ఆరోగ్యశ్రీ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకురా వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్నేహిక, ఆరోగ్య సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.