Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
నిజాం కళాశాలలో ఈనెల 30 తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ బి.భీమా తెలిపారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హ్యూమన్ కాపిటల్ డెవల ప్మెంట్ సెంటర్ (హెచ్ సిడిసి), ఓయూ వారి సహ కారంతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. లియోనైన్ కన్సల్టింగ్ సర్వీస్, నిజాం కళాశాల సంయుక్తంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాల్గొనా లనుకునే వారు ఉదయం 10 గంటలకు నిజాం కళాశా లకు చేరుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో దాదాపుగా 30 కంపెనీలు పాల్గొననున్నట్టు తెలిపారు. 3500 నుంచి 4000 ఉద్యోగాలు బీపీఓ, ఐటీ, సాఫ్ట్వేర్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, బీఎఫ్ఎస్ఐ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ జాబ్ మేళాలో యూజీ, పీజీ, బీఈ, బీటెక్ ఇతర విద్యార్హతలు ఉన్న విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా ఉస్మాని యా విశ్వవిద్యాలయం హెచ్డీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, నిజాం కళాశాల పూర్వపు ప్లేస్మెంట్ కో-ఆర్డినేటర్ మురళిధర్ రెడ్డి హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ సీవీ రజని, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతి పాల్గొన్నారు.