Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో స్పందన 2కె 22పేరుతో కళాశాల ప్రాంగణంలో 22వ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటా పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మెన్ మర్రి రాజశేఖర్‌రెడ్డి, సెక్రెటరీ సీహెచ్. సత్తిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రెజరర్ బి.రాజేశ్వరరావు హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టుదలతో చదివితే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరో హించవచ్చ అన్నారు. తమ కళాశాలలో చదివే విద్యారు ్థలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. విద్యార్థులు ఒక గోల్ ఏర్పరచుకుని లక్ష్యసాధన వైపు అడు గులు వేయాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తెలుగుజాతి సంగీత నృత్య ప్రదర్శన అందరినీ ఆకటు ్టకుంది. ప్రాచీన సంప్రదాయ, కుల వృత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు సంగీతం, ముగ్గుల పోటీ, నేయిల్ పెయింటింగ్స్, చిత్రలే ఖనం తదితర సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. శని వారం సాయంత్రం ''ది కాస్ పెట్టి నైట్'' పేరుతో ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. గాయకులు మోహన బి, నోయల్ సెస్, డిజె సారంగు, డీజే నాడులల సంగీత ప్రదర్శన విద్యార్థులను అలరింప జేసింది. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, కళాశాల యాజమాన్యం బహుమతులను అందజేసింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎల్వి నర సింహ ప్రసాద్, కళాశాల ఫ్యాకల్టీ అధ్యాపకులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.