Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కృష్ణా లహరి కావ్యంలోని పద్యాలు తెలుగు భాషా లాలిత్యానికి దర్పణమని దూరదర్శన్, హైద్రాబాద్ కేంద్ర విశ్రాంత సంచాలకులు డాక్టర్ పీ. మధుసూదనరావు అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై సాహితీ కరణం మాస పత్రిక నిర్వహణలో పింగళి వేంకట కష్ణా రావు రచించిన కష్ణా లహరి కావ్యం చమత్కారాలు సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ కష్ణారావు బహుగ్రంథ కర్త అభినందించారు. కష్ణా రావులో పండితీ ప్రతిభ, అభ్యాసం, ప్రజ్ఞ ఉన్నాయని, అవి ఆయన పద్యాల్లో ప్రస్ఫూటించాయని వివరించారు. అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అనంత పద్మనాభ శర్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో చమత్కారాల కవితలకు ప్రబంధ కవుల నుంచి ప్రత్యేక స్థానం ఉందని, కష్ణా రావు ఆ సంప్రదాయం కొనసాగిస్తున్నట్లుగా వ్యంగ అధి క్షేప పదాలతో చెమ్మక్కులు రాసారని ప్రశంసించారు. సాహితీకిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు డాక్టర్ వై.రామకష్ణారావు, శర్మ తదితరులు పాల్గొన్న సభకు వెంకట రెడ్డి స్వాగతం పలికారు. కవి పెద్దూరి వెంకట దాసు సభ నిర్వహించారు.