Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళినగర్ ఫుల్ గోస్పెల్ చర్చ్ వద్ద, పాస్టర్ రెవ.డా.పి.ఇశ్రాయేలు, ఇగేషేయస్ దంపతుల 36వ యానివర్సరీ సందర్భంగా హాండ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరానికి ప్రభత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, హాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ రెవ కెనడి, శివరాజ్ గౌడ్, మోజెస్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, ఏడుపాయల శ్రీనివాస్, వెంకటకష్ణ, లలన్, దేవేందర్, ఉమేష్, సంతోష్, పాస్టర్లు శామ్యూల్ కోకిల, సత్యరాజు, ఎం.రాజు, కర్ణాటక రాజు, రాంబాబు, స్టీఫెన్ పాల్, ఆర్.పి.దాస్, షాలేంరాజు, సతీష్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.