Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవ తెలంగాణ-సరూర్‌నగర్
ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల పేదలకు ఎంతో మేలు జరుగు తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఆర్కేపురం కాలనీకి చెందిన రాములయ్య ప్రమాదవషాత్తు గాయపడి కాలు ఆపరేషన్ చికిత్స చేయించుకోగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతూ నాయకులను సంప్రదించగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో వారి చేతులమీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రి కార్యాలయంలో రూ.45000ల చెక్‌ను అదించినారు. మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు అందరికీ ఎందుకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీిఆర్‌ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, నాయకులు అరవింద్ శర్మ, సాజీద్, భూపాల్ రెడ్డి, పటేల్ సునీత రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిద్దగోని వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు ముచింతల జగన్, నవీన్ పాల్గొన్నారు.