Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
'మీరు పొగతాగిన ప్రతిసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి' అనే నినాదంతో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ నుంచి సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ వరకు ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వె న్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్ మాట్లాడుతూ ఊపిరితిత్తుల ఊపిరి తీస్తున్న అనేక కారకాల్లో పొగాకు ముఖ్యమైనది అన్నారు. పొగాకు హుక్కా, చుట్ట, బీడీ, సిగరెట్ తదితర రూపాల్లో మార్కెట్లో అందరికీ చేరువలో లభ్యమయ్యే మత్తు పదార్థం అని తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా నేటి యువతకు ధూమ పానం అలవాటుగా మారిందనీ, ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు, అనారోగ్య కారకాల్లో ధూమపానం మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకిందని తెలిపారు. ధూమపానం చేస్తున్న వారిలో 22.6 కోట్ల మంది పేదవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సర్వేలో తెలిపిందనీ, భారత్లో 5,500 మంది ఏటా ఈ వ్యసనానికి దాసోహం అవు తున్నట్టు అధ్యయనాలు చాటుతున్నాయని తెలిపారు. కీలక అవయవాలకూ హానికరమే అనీ, పొగాకు వల్ల గుండెకు నేరుగా హాని జరుగుతుందనీ, గుండె కవాటాలు మూసుకుపోయి గుండెపోటు, రక్తపోటు పెరుగుతాయని తెలిపాఉ. కణంలోని జన్యు పదార్థాలు / డీఎన్ఏకు హాని జరుగుతుందని తెలిపారు. పొగ తాగడం వల్ల నోటి దుర్వాసన, గొంతు వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కఫం, దగ్గు, దమ్ము, ఆయాసం, గుండె కవాటాలు మూసుకుపోయి గుండెపోటు, రక్తపోటు, క్యాన్సర్ లాంటివెన్నో రోగాలు వస్తాయని తెలిపారు. నోట్లో చాలాకాలం వరకు తగ్గని పుండ్లు (అల్సర్స్), నోటిలో ఎక్కడైనా కండ పెరగడం, తెల్లని మచ్చ కనిపించడం, నమలడంలో ఇబ్బంది, నోటి/ నాలుక/దవడ కదలికలు మందగించడం, చాలాకాలం పాటు గొంతు బొంగురుగా ఉండటం, గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్టు అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘు కాంత్, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ మేఘనా రెడ్డి, సెంటర్ హెడ్ మాత ప్రసాద్, నర్సింగ్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ సుమారుగా 100 మందికి పైగా పాల్గొన్నారు.