Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాద సమయంలో నీరు, ఆహారం ఇవ్వొద్దు
- కార్మికుని తెగిపోయిన మణికట్టును తిరిగి అతికించిన సిటిజన్స్ స్పెషాలిటీ వైద్యుల బృందం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని 22 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికునికి అవయవ పునరుద్ధరణ శస్త్రచికిత్స చేయడం ద్వారా సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ మరో మైలురాయిని సాధించింది. జంట నగరాల్లోని అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్లతో కూడిన ఉత్తమ బృందాలలో ఒకటైన డాక్టర్ అశోక్ రాజు గొట్టెముక్కల నేతత్వంలోని డాక్టర్ వాసుదేవ జువ్వాడి మరియు డాక్టర్ కిలారు ప్రఫుల్ బంధం తెగిపోయిన మణికట్టును శస్త్రచికిత్స ద్వారా తిరిగి అమర్చారు. ఈ చికిత్సలో ప్లాస్టిక్ సర్జన్లు డాక్టర్ వెంకటేష్ బాబు, మరియు డాక్టర్ శశిధర్ రెడ్డితోపాటు నిపుణులైన అనస్థీషియాలజిస్టుల బృందం కూడా శస్త్రచికిత్స విజయవంతానికి తమవంతు సహకారాన్ని అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌రాజు గొట్టెముక్కల మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో రోగిని తీసుకొస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయని తెలిపారు. గోల్డెన్ అవర్ 6 గంటలు ఉంటుందని ఆ సమయంలోపు రోగిని ఆసుపత్రికి తీసుకొస్తే మంచిదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులకు నీళ్లు, ఎలాంటి ఆహారం ఇవ్వొదని అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి సమీపంలోని నందిగ్రామ్‌కు చెందిన 22 ఏళ్ల హరీష్ స్థానికంగా ఓ పానీయాల ఫ్యాక్టరీలో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో అతని కుడి మణికట్టు ప్రమాదవశాత్తు తెగిపోయిందని, దాంతో అతని సహోద్యోగులు తెగిపడిన అవయవాన్ని ప్లాస్టిక్ కవర్లో వేసి, ఐస్‌లో ప్యాక్ చేసి, అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, నల్లగండ్లలోని సిటిజన్స్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అయితే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చేరుకునే సమయానికే రోగికి అధిక మోతాదులో రక్తం పోవడంతో షాక్‌కు గురైయ్యాడన్నారు. అంతే కాకుండా అతని వెంట వచ్చిన వారుసహితం ఆందోళనకు గురయ్యారన్నారు. వెంటనే అతన్ని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లామని వివరించారు. ఆర్థోపెడిక్స్‌కు చెందిన డాక్టర్ వాసుదేవ జువ్వాది, డాక్టర్ కిలారు ప్రఫుల్తోపాటు ప్లాస్టిక్ సర్జరీ నుండి డాక్టర్ వెంకటేష్ బాబు, డాక్టర్ శశిధర్ రెడ్డి చేతిని తిరిగి అతికించేందుకు శస్త్రచికిత్స చేశారన్నారు. లింబ్ సర్జరీ రీప్లాంటేషన్ ప్రక్రియ ఎనిమిది గంటల పాటు కొనసాగిం దన్నారు. ఇప్పుడు హరీష్‌కి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా, మంచి కండరాలను కలిగి ఉన్నాడని తెలిపారు.
ఎంత త్వరాగా తీసుకొస్తే అంత మేలు:డాక్టర్ ప్రభాకర్ పలచర్ల
ప్రమాదం జరిగిన తర్వాత మొదటి 60 నిమిషాలు 'గోల్డెన్ అవర్'గా పరిగణిస్తారని, అందువల్ల, గాయం తీవ్రతను త్వరగా పరిశీలించడం ముఖ్యమైందని సిటీజన్స్ స్పెషాలిటీ ఆస్పత్రి, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పలచర్ల తెలిపారు. వృత్తిలో భాగంగా అధిక సంఖ్యలో కార్మికులు వివిధ యంత్రాలతో ఎక్కువగా పనిచేస్తారని దాంతో చేతి గాయాలపాలవుతారన్నారు. కొన్ని సందర్భాల్లో చేయి తెగిపోవడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.ంటేషన్ విషయంలో, రోగిని ఆరు గంటలలోపు ఆసుపత్రికి తరలించడం, అవయవాన్ని సంరక్షించడం వల్ల మంచి ఫలితాలుటాయన్నారు. మా వద్ద ఎలాంటి పాలీట్రామా కేసులనైనా ఉత్తమ ఫలితాలోస్తాయన్నారు.