Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారు
- ఓట్ల కోసం మార్నింగ్ వాక్‌లా లేక కామెడీ షోలా
- కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ-వనస్థలిపురం
ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై బురదజల్లే చిల్లర పనులు మానుకోవాలని వనస్థలిపురం డివిజన్ టీిఆర్‌ఎస్ అధ్యక్షుడు చింతల రవికుమార్, బి.ఎన్.రెడ్డి డివిజన్ టీిఆర్‌ఎస్ అధ్యక్షుడు కటిక రెడ్డి అరవింద్ రెడ్డిలతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు చేసే కాంగ్రెస్ నేతలకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని, ఓట్ల కోసం మార్నింగ్ వాక్‌ల పేరుతో ప్రజలను కామెడీ షోతో మభ్య పెట్టే చర్యలు మానుకోవాలని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కమ్మ సంఘం సభ్యులు కోరిక మీద రోడ్డు వెడల్పు విషయంలో ఎన్టీ రామారావు విగ్రహానికి ఎలాంటి హానీ జరగకుండా నిర్మించే ఫ్లైఓవర్ కింద అతి సుందరంగా విగ్రహాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే చెప్పడం ఏ విధంగా తప్పు పడుతున్నారో తెలియడంలేదన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, టీిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి పనులకు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేయటం తగదన్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల బలం లేదని, ఇక్కడి ప్రభాకర్‌రెడ్డి మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎస్టీ డిపాజిట్ కూడా దక్కలేదని, అదేవిధంగా దరిపల్లి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు అని, మూడోసారి ఆ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టకపోవడంతో గెలుపొందడం గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌గౌడ్, సాహెబ్‌నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మెన్ శ్రీధర్ గౌడ్, నాయకులు అజరు, శ్రీనివాస్ యాదవ్, ఐలయ్యగౌడ్, మధుగౌడ్, జైపాల్, రాజు, నరసింహ, రాంబాబు, ఉమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.