Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలం, కరీంగూడ గ్రామ పంచాచతీ పరిధిలో మూడేండ్లుగా మంచి నీళ్ళు రావడం లేదని గ్రామ స్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గ్రామ ప్రధాన రహదారిపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. హెచ్ఎం డీఏ నుంచి మంచి నీళ్ళు రాకున్నా, ప్రజలకు బిల్లులు మాత్రం యధావిధిగా వస్తున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. మంత్రి మాల్లారెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లితే హెచ్ఎండీఏ అధికారులతో మాట్లా డినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తమ ఊరికి మంచి నీళ్ళు రాక మూడేండ్లు అవుతుంది ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు ఇచ్చిన జిల్లా అధికారులు, మంచినీరు ఇవ్వడంలో నిర్లక్షం వస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గోపాల్ రెడ్డ్కి మెమోరాండం అందజేశారు. సర్పంచ్ గోపాలరెడ్డి మాట్లాడుతూ మంచినీటి పైపులైన్లు వర్క్ ఆర్డర్ శాంక్షన్ అయ్యిందనీ, త్వరలోనే మంచినీటిని ప్రజలకు అందిస్తామని తెలిపారు.