Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ఆర్ కింద ఇవ్వాలని కమిటీ నిర్ణయం
- కైతలాపూర్‌లో బయోవేస్ట్తో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు
- జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 17 అంశాలకు ఆమోదం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌లోని పలు పార్కులను నిర్వహించడానికి సీఎస్ఆర్ కింద ప్రయివేట్ సంస్థకు ఇవ్వాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం 11వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
1.లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్లమ్ ఏరియాల్లో ఉంటున్న 35 ఏండ్లలోపు 600 మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు చందానగర్ సర్కిల్-21లోని హుడాకాలనీలో గల మోడల్ మార్కెట్ బిల్డింగ్‌ను ఏడాది పాటు ఇచ్చేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంఓయూ చేసుకోవడానికి అనుమతికి కమిటీ ఆమోదం.
2.జీవీకే, ఈఎంఆర్ఐ ద్వారా నిర్వహిస్తున్న డయల్ 100 సర్వీసును జీహెచ్ఎంసీ ద్వారా రిజిస్టర్ అయిన 38 శాతం రిజిస్టర్ కాల్స్‌కు, మరో మూడేండ్లపాటు పొడిగించడానికి జీవికే, ఈఎంఆర్ఐ ఆవరణలో ఉన్న డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆపరేషన్, మెయింటెనెన్స్ కోసం 10 శాతం వార్షిక పెంపు సందర్భంగా రూ.99,39,641 అంచనా వ్యయాన్ని చెల్లించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం.
3.కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ కింద బాలానగర్ హాల్ లిమిటెడ్ సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లు, 2023-2024కు రూ.100 కోట్లు మొత్తం రూ.400 కోట్లు ఇవ్వనున్నందున ఆ నిధులతో కైతలాపూర్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద బయో వేస్ట్ కోసం బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు నుంచి సీఎన్జీ గ్యాస్ తయారు ప్లాంట్ ఏర్పాటుకు టెండర్ పిలుచేందుకు అనుమతితోపాటు ఒప్పందం చేసుకోవడానికి కూకట్పల్లి జోనల్ కమిషనర్‌కు అథరైజేషన్ ఇవ్వడానికి కమిటీ ఆమోదం.
4.రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద లింక్ రోడ్డు హబ్సిగూడ వద్ద సుదర్శన్‌రెడ్డి స్వీట్ హౌమ్ కార్నర్ నుంచి కిమిడి కాలనీ లోపలి వరకు, బ్యాంక్ బరోడా కాలనీ కుడి భాగం వరకు నాచారం వరకు కనెక్ట్ చేస్తూ 18 మీటర్ల వెడల్పు కోసం 203 ఆస్తుల సేకరణకు ఆమోదం.
5.ఖైరతాబాద్జోన్లోని మల్లేపల్లి సర్కిల్-12లో గల శిథిలావస్థలో ఉన్న జకీర్ హుస్సేన్ కమ్యూనిటీహాల్‌ను రూ.5.90కోట్లతో చేపట్టే మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పన, మొత్తం 1609 చదరపు మీటర్లు ఉన్న దానిలో 675 చదరపు మీటర్ నుంచి 800 చదరపు మీటర్ ప్లింత్ ఏరియా నుంచి వృద్ధి చేయడానికి కమిటీ ఆమోదం.
6.ఖైరతాబాద్‌జోన్, సర్కిల్-12 గుడిమల్కాపూర్ వార్డు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ పిల్లర్ 56 వద్ద గల 608 మీటర్ల విస్తీర్ణంలో రూ.6కోట్ల అంచనా వ్యయంతో సర్కిల్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మించేందుకు ఆమోదం.
7.శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్ సర్వే నెం.37, 34 శిల్పా పైనీర్ వద్ద పార్కును ఏడాదిపాటు సీఎస్ఆర్ కింద మెయింటెనెన్స్ చేసేందుకు ఫొనిక్స్ టెక్నో ప్రై.లిమిటెడ్‌తో అడిషనల్ కమిషనర్ ఎంఓయూ చేసేందుకు అనుమతి జారీ చేస్తూ కమిటీ ఆమోదం.
8.సీఎస్ఆర్ కింద శేరిలింగంపల్లిజోన్ మాదాపూర్ సర్కిల్ నెంబర్-20 సర్వే నెంబర్ 64 హుడా టెక్నో ఎన్క్లేవ్ అనుకోని ఉన్న పార్కుల సుందరీకరణ, నిర్వహణ కోసం ఏడాదిపాటు చేపట్టేందుకు ఎల్‌ఎన్‌బీ రియాల్టీ, ఎల్ఎల్పీ అడిషనల్ కమిషనర్‌కు ఎంఓయూకు అనుమతి ఇస్తూ కమిటీ ఆమోదం.
9.చార్మినార్ జోన్ చాంద్రాయణగుట్ట సర్కిల్-8లో చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ నుంచి మొఘల్కాలనీ వరకు రూ.6కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే మోడల్ కారిడార్ నిర్మించేందుకు కమిటీ ఆమోదం.
10.పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ పిల్లర్ నెం.143 రాంబాగ్ గోల్డెన్ కేఫ్ నుంచి బహదూర్‌పుర జంక్షన్ వయా కిషన్‌బాగ్ రోడ్డు వరకు 30 ఫీట్లు వెడల్పు చేసేందుకు 278 ఆస్తుల సేకరణకు ఆమోదం.
11.ఆర్డీపీ కింద ఐఎస్ సదన్ జంక్షన్ నుంచి బైరామల్‌గూడ జంక్షన్ వయా చంపాపేట్, కర్మన్ ఘాట్ వరకు 45 మీటర్లు, 60 మీటర్ల రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా ఇందిరా సేవ సదన్ నుంచి సర్కిల్-7 పరిధి వరకు 45 మీటర్ల వెడల్పు చేసేందుకు 135 ఆస్తులు, సర్కిల్-7 పరిధి నుంచి బైరమల్గూడ వరకు 60 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం 183 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
12.నల్లగొండ క్రాస్ రోడ్స్ వద్ద వికాసం కార్యక్రమం నిర్వహణకు నేషనల్ సెన్సార్ పార్క్ నిర్వహణ, ఎన్జీఓ, ఏఈఎస్ సర్వీసుకు 75 శాతం షేర్ రూ.21.15 లక్షలు అయేషా ఎడ్యుకేషన్ సర్వీస్‌కు మూడేండ్ల పాటు జరిగే ఖర్చు చెల్లించుటకు కమిటీ ఆమోదం.
13.వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు అలీమ్‌కో సంస్థ ద్వారా సహాయ, ఉపకరణాలు ఆర్టిఫిషియల్ లింబ్స్ జీహెచ్ఎంసీ నిధులతో అందించేందుకు క్యాంపు నిర్వహణ కోసం అలింకో స్వచ్ఛంద సంస్థకు అనుమతి.
14.ఖైరతాబాద్ జోన్ సనత్‌నగర్ దాసారం బస్తీలో సర్కిల్-17లో రూ.6 కోట్ల అంచనా వ్యయంతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ (కన్వెన్షన్సెంటర్) నిర్మించేందుకు పరిపాలన సంబంధిత అనుమతికి ఆమోదం.
15.ఖైరతాబాద్ జోన్ కార్వాన్ సర్కిల్ జంజం కిరానా, జనరల్ స్టోర్ జీషాన్ కేఫ్ టోలిచౌకి వద్ద ఎస్‌డబ్ల్యూడీ 1200 ఎంఎం డయా ఎన్పీ3 పైప్‌లైన్ రూ.2.13 కోట్లతో వేసేందుకు పరిపాలనా ఆమోదం కోసం కమిటీ ఆమోదం.
16.ఎల్బీనగర్ జోన్ పటేల్‌నగర్ ఎస్పీటీ నుంచి డీ మార్ట్ ఉప్పల్ భగాయత్ లే అవుట్ వరకు రూ.4.90 కోట్లతో సీసీ రోడ్డు నిర్మించేందుకు కమిటీ ఆమోదం.
17.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖజానా గ్రూప్ ద్వారా ఖైరతాబాద్ జోన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12 ఎమ్మెల్యే కాలనీ వద్ద జీహెచ్ఎంసీ ఓపెన్ స్పేస్‌లో గ్రీనరీని అభివృద్ధి చేసేందుకు కమిషనర్ అనుమతి కోసం కమిటీ ఆమోదం.