Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
డ్రయినేజీ వ్యవస్థలో పనిచేసే ప్రతీ కార్మికున్ని గౌరవించాలి అని గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. జలమండలి వారోత్సవాల్లో భాగంగా గురువారం గాంధీనగర్ డివిజన్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రయినేజీ వ్యవస్థలో పనిచేసే ప్రతి కార్మికున్ని గౌరవించాలన్నారు. మ్యాన్హోల్లో ప్రజలు, షాంపూ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహార పదార్థాలు, బట్టలు, పాలిథిన్ కవర్లు, సీసాలు, గాజు ముక్కలు, ఇటుకలు వేయొద్దని సూచించారు. అపార్ట్మెంట్స్, వాణిజ్య భవనాల్లో సిల్ట్ చాంబర్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు వినరు కుమార్, డీజీఎం చంద్రశేఖర్, మేనేజర్ వేణుగోపాల్ నాయుడు, శంకర్, మల్లేష్, జగన్, బీజేపీ నాయకులు సాయి కుమార్, ఆనంద్ రావు, ఆకుల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.