Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్‌లోని సుందరయ్య భవన్లో మే 21 నుంచి 31 వరకు ప్రగతి నగర్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంప్ ముగిసింది. సి.హెచ్ మల్లయ్య చారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకష్ణ, విశిష్టఅతిథిగా
డి.దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు హాజరై ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహణపై అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనగా వివిధ అంశాలపై 12 టీమ్స్ ఏర్పాటు చేసి ఈ టీమ్స్‌లలో ఆరోగ్య విషయాలతో పాటు, సైన్స్‌కు సంబంధించి, మంటలేని వంట, మ్యాజిక్ షోతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించిన రీసెర్స్ పర్సన్స్‌ను, ఈ మొత్తం చిల్డ్రన్స్ క్లబ్ కార్యక్రమాలకు కన్వీనర్‌గా వ్యవహరించిన అనిలను అభినందించారు. ఈ సందర్భంగా డి.దయాకర్ రెడ్డి మాట్లాడుతూ సుందరయ్య భవన్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, విద్యార్థులు, వీటిని ఉపయోగించుకోవాలని అని తెలిపారు. క్యాంపులో అద్భుతమైన చిత్రలేఖనం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం టాలెంట్‌తో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు మరిన్ని నైపుణ్యత పెంపొందిం చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్ శ్రీరాములు, బి వెంకట రామయ్యలు, ప్రశాంతి ఇ.అనిల టీం ఆర్గనైజర్లు, రీసర్స్సుపర్సన్, పిల్లలు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.