Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (విఎన్ఆర్ విజెత్)లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న 13వ అఖిలభారత ఇంజనీరింగ్ కళాశాల క్రీడోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ జి.శ్రీరామ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో చుట్టుపక్కల మన దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, నుంచి 1041 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, క్రీడ స్పోర్ట్స్ ఫెస్ట్‌లో భాగంగా క్రికెట్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, త్రో బాల్, ఫుట్ బాల్, కబడ్డీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, చెస్ వంటి ఇండోర్ క్రీడలు కొనసాగుతు న్నాయని తెలిపారు. కళాశాల ప్రధానోపాధ్యాయకులు ఆచార్య డాక్టర్ సీడీ నాయుడు క్రీడాకారులను స్వాగతిస్తూ మాట్లాడుతూ క్రీడలు దేహదారుఢ్యానికి కాక మానసిక బలానికి, ఉత్సాహానికి దోహదపడతాయని, క్రీడోత్సవాలు జయాపజయాల నిమిత్తం లేకుండా పాల్గొనాలని తెలిపారు.