Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
నవతెలంగాణ-కూకట్పల్లి
హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల మండలి వారు, ఆల్విన్ కాలని 124 డివిజన్, ఆల్విన్ కాలనీ ఫేస్-1 సాయి ఫంక్షన్ హాల్లో పారిశుధ్య కార్మికులు పనిచేసే ప్రదేశంలో భద్రతాప్రమాణాల గురించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిóగా స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ జలమండలి సిబ్బందితో కలిసి ప్లకార్డులు పట్టుకుని సేవ్ వాటర్ నినాదాలతో ఆల్విన్ కాలనీ వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ తాగునీటి మరియు మురుగు నీటి విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులు సరైన పీపీిఈ కిట్ దరించి భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని అన్నారు. అలాగే బస్తీవాసులు కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలను మరియు పనికిరాని వస్తువులను మ్యాన్ హోల్స్‌లో వేయకుండా జలమండలి వారికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బి డివిజన్ 9 జెఎన్‌టియూ, కూకట్పల్లి డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ఝాన్సీ, వర్క్ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, సూపర్వై జర్ శివ, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు రాజేష్‌చంద్ర, కాశినాథ్ యాదవ్, కష్ణారావు, అంజిరెడ్డి, రాజు, మోజెస్, రామకష్ణ బాబారు, చంద్రశేఖర్‌రెడ్డి, సంగమేష్, ఎత్తరి శ్రీను, సత్యనారాయణ, అర్వరవి, దేవేందర్, జీ.ఎచ్.ఎం.సీి సిబ్బంది మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.