Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ సీపీ ఎం.రమేశ్
- సీపీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్వరాష్ట్రం ఏర్పడ్డాక పోలీసు శాఖలో ఎన్నో అధునాతన మార్పులు వచ్చాయని, పోలీసుశాఖకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చి, నిధులు వెచ్చిస్తున్నారని జాయింట్ సీపీ యం.రమేశ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీ కార్యాల యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను అధిగమించి అభివద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు ప్రాధాన్యతనివ్వడంతోపాటు నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. సీఎం చొరవతో పోలీసు శాఖలో కీలక మార్పులు వచ్చాయన్నారు. శాంతిభద్రతలతోపాటు మహిళా భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేరాలను కట్టడి చేసేందుకు 'సీసీటీవీ' నెట్వర్క్, ఆధునిక పోలీసింగ్ వ్యవస్థను అమల్లోకి తెచ్చామన్నారు. సిటీలో శాంతి భద్రతలకు ఢోకా లేదన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులు నగరం వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రజలు కష్టపడి పనిచేసే స్వభావం, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన, వినూత్న విధానాలు అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. విభిన్న సంస్కృతులు, జాతీయాలు, మతాల కేంద్రంగా ఉన్న రాష్ట్రం అన్ని రంగాలలో ఆకట్టుకునే పురోగతిని సాధించిందన్నారు. వేడుకల్లో భాగంగా మహిళా సిబ్బంది సీపీ కార్యాలయంలో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు. కార్యాలయ సిబ్బంది పద్మజ, కళ్యాని, కవిత, ఉర్మిళను జాయింట్ సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కర్యాక్రమంలో ఏడీఓ శ్రీదేవి, అకౌంట్స్ ఆఫీసర్ జి.సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సెల్ రాఘవేంద్ర, యం.రాజు, ఇన్స్పెక్టర్ కంట్రోల్ రూమ్ నిరంజన్, బిల్డింగ్ ఇన్చార్జీ ఎస్.ప్రశాంత్బాబు, పీఏ టు అడ్మిన్ జీఎస్ వినరుకుమార్, మినీస్ట్రీయల్ స్టాఫ్ అధ్యక్షుల శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం ఎన్.శంకర్రెడ్డితోపాటు ఇతర పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.