Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు తమ కవితలను చదివి వినిపించారు. అనంతరం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ 25 మంది కవులకు రూ.2వేల నగదుతో పాటు పూలబోకే అందించి శాలువతో ఘనంగా సత్కారించారు. అంతకుముందు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజల్వను చేశారు. జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి భానుప్రసాద్, అడిషనల్ పౌర సంబంధాల అధికారి అరుంధతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.