Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్వరలో న్యాక్ పీర్ టీం విజిట్ ఉన్నందున కళాశాల విద్యాశాఖ నుండి రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్
జి. యాదగిరి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ వేదాల తిరువేంగళాచార్యులు గురువారం కళాశాలకు విచ్చేసి న్యాక్ ఏర్పాట్లను,అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉత్తమ గ్రేడింగ్ పొందడానికి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కే.జ్యోత్స్నప్రభ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ ఇంతియాజుఉద్దీన్ ఫారూఖీ, అకడమిక్ కోఆర్డినేటర్ బి. రవీందర్‌గౌడ్, ఎన్.సీి.సీి. లెఫ్టినెంట్ డాక్టర్ ఎస్.ధన్‌రాజ్, అధ్యాపకులు కె.సురేష్, డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ రాకేష్ భవాని, గంజి శశిధర్ ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్.సీి.సీి. క్యాడెట్స్ పాల్గొన్నారు.