Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయినపల్లి ప్లే గ్రౌండ్లో జరుగుతున్న ఆరవ సీనియర్ జాతీయ స్థాయి ఫిస్ట్‌బాల్ పోటీల్లో మొదటి రోజున వివిధ రాష్ట్రాలకు చెందిన జట్ల మధ్య ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో తమిళనాడు జట్టు పంజాబ్ పై, హిమాచల్‌ప్రదేశ్ రాజస్థాన్ జట్టుపై, పాండిచ్చేరి జట్టు కేరళ పై , తెలంగాణ జట్టు చండీఘర్ పై, ఛత్తీస్ ఘడ్ జట్టు ఉత్తరప్రదేశ్ జట్టు పై విజయం సాధించాయి. ఇక బాలికల విభాగంలో తమిళనాడు జట్టు ఒడిస్సా పై, హిమాచల్ ప్రదేశ్ జట్టు చండీగఢ్. గోవా జట్టు కేరళ పై, తెలంగాణ జట్టు గోవా జట్టుపై విజయం సాధించాయి. కాగా రెండో రోజు కూడా తెలంగాణ ఫెస్టివల్ బాల్ అసోసియేషన్ చైర్మెన్ జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాటుచేసి పోటీలు సజావుగా సాగేందుకు పర్యవేక్షించారు. కాగా పలు జట్ల ప్రారంభ కార్యక్రమానికి చైర్మెన్ జంపన ప్రతాప్ టాస్ వేసి మ్యాచ్‌లను పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలను వారితో కలిసి అభినందించారు.