Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక కార్యకర్త అబ్దుల్ మోయిజ్ సిద్దీఖీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
కర్ణాటక రాజధాని బెంగళూరులో రైతు నాయకుడు రాకేశ్ టికాయత్‌పై ఇంకు దాడి అత్యంత హేయమని సామాజిక కార్యకర్త అబ్దుల్ మోయిజ్ సిద్దీఖీ తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఆయన చెత్తర్ బజార్లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పోరాడి సాగుచట్టాలు రద్దయ్యేంతవరకూ టికాయత్ పోరాడారని, ఆయనపైపై దాడి జరగడం దారుణం, దుర్మార్గమని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాని, ఎంతటివారినైనా వదలకుండా శిక్షించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాకేశ్ టికాయత్‌కు తగిన భద్రత కల్పించాలని కోరారు. ప్రతీ భారతీయ రైతుబిడ్డ రైతు నాయకుడికి అండగా ఉన్నారన్నారు. ఈ దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని చెప్పారు.