Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ రమేశ్ ఆరోపణ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుందని తెలంగాణ వైద్య ఆరోగ్య మెడికల్ జేఏసీ డాక్టర్ బొంగు రమేశ్ ఆరోపించారు. గురువారం కోఠి డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీకి చెందిన ఉద్యోగులను తెలంగాణకు అలర్ట్ చేశారని వారిలో 140 మంది ఉద్యోగులు విభజనపై స్టే తెచ్చుకున్నారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ఉద్యోగులు తెచ్చుకున్న స్టేను వేకెట్ చేయించడం లేదన్నారు. ఇటీవల కాలంలో హైకోర్టు జడ్జిమెంట్ రావడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు వారిని వారి స్వస్థలాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు అని చెప్పారు. అందరూ రిలీవ్ అయినప్పటికీ పేట్ల బురుజు సూపరింటెండెంట్ డాక్టర్ నాగమణి, గైనకాలజిస్ట్ డాక్టర్ అండాలు, గాంధీ ఆస్పత్రి పెథాలజీ హెచ్ ఓడీ డాక్టర్ శ్రీ లక్ష్మి లను ఎందుకు డీఎంఈ రిలీవ్ చేస్తలేరు అని ప్రశ్నించారు. సిద్దిపేట్ టు మహబూబ్‌నగర్ అటానమస్ మెడికల్ కాలేజీలకు రిటైరైనా డాక్టర్లను డైరెక్టర్లుగా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దష్టిసారించి సమస్యలను సరిదిద్దాలని కోరారు.