Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ విద్యార్థి సంఘం డిమాండ్
నవతెలంగాణ-అడిక్మెట్
ఇంజినీరింగ్ విద్యార్థులకు ర్యాంకుల నిబంధన ఎత్తి వేసి అర్హులందరికీ పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లపల్లి అంజి అధ్యక్షతన బీసీ విద్యార్థి సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్.కష్ణయ్య హాజరై మాట్లాడుతూ. ఇంజినీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ విద్యార్థులకు 10 వేల ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి అర్హులందరికీ పూర్తి ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు కట్టలేక చాలామంది చదువు మానేస్తున్నారని అన్నారు. రెండేండ్లుగా ఫీజుల బకాయిలను చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. పేద కులాలు చదువుకుంటే సంపన్న వర్గాల దోపిడీ పాలన అంతమవుతుందని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్, నికిల్, తిరుపతి, పచ్చిపాల రామకష్ణ, రవి,హేమంత్, శ్రీకాంత్, మహేష్, సాయి తేజ, రాజు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.