Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ బహుజన విద్యార్థి జేఏసీ ఆవిర్భవించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఓయూలో ఏర్పాటుచేసిన సభలో జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రొ.వినోద్ కుమార్ హాజరై ప్రసంగించారు. బహుజన జేఏసీ చైర్మైన్గా వేల్పుల సంజరు, అధ్యక్షుడుగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏండ్లు పూర్తయిన బహుజనులకు రాజ్యాధికారం అనే లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదన్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు దొరల పాలయ్యాయని, రాష్ట్రంలో బహుజనులను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా నేడు ఓయూలో తెలంగాణ బహుజన విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పులిగంటి వేణు గోపాల్, కొత్తపల్లి.తిరుపతి, సునీల్ శెట్టి, సురేష్, దర్శన్, అంబేద్కర్, నవీన్, చంద్రకాంత్, రాజ్ కుమార్, కమలాకర్, రాజు, శివ, ప్రశాంత్, రమేష్ నాయక్, పాండు యాదవ్ పాల్గొన్నారు.