Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పోటీతత్వంతో పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్క కార్మికుడు పనిచేయాలని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పిలుపునిచ్చారు. గురువారం కార్పొరేటర్ క్యాంప్ కార్యాలయంలో పట్టణ ప్రగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని పోటీతత్వంతో పని చేయాలన్నారు. ప్రజలు, యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నోడల్ ఆఫీసర్ వెంకటేష్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.