Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఆనంద్
నవతెలంగాణ-ధూల్‌పేట్
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఆనంద్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమి అధినేత్రి బాలలత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 676వ ర్యాంకు సాధించిన బచ్చు స్మరణ్ రాజ్‌ను ఘనంగా సన్మానించారు. సెట్విన్ శిక్షణ పొందాలనే నిరుపేదలకు సహాయం అందిస్తున్న స్వచ్ఛకర్మ ఫౌండేషన్ ప్రతినిధి కార్తీక్ సూర్య, విజయ ఫౌండేషన్ ప్రతినిధి కమలకుమార్ను సత్కరించారు. తనకు వచ్చిన సమస్యను కూడా అధిగమించి 'సివిల్స్ సర్వీసెస్‌లో అత్తుత్తమ ర్యాంకును స్మరణ్ రాజ్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన స్ఫూర్తితో యువతీయువకులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో స్మరణ్‌రాజ్ తల్లితండ్రులు రమేశ్, నాగరాణి, సెట్విన్ ఎకౌంట్స్ ఆఫీసర్ సురేశ్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.