Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
చేనేతకారులను ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని మిస్సెస్ ఇండియా 2022 విజేత పి. సుహాసిని అన్నారు. కోవిడ్ కారణంగా అన్ని రంగాలతో పాటు చేనేత రంగం కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని ఆమె అన్నారు. గురువారం గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్పోను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కారులు ఒకే వేదికలో తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భారతీయ సంస్కతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, నేటికి వాటిపై వన్నె తగ్గలేదని అన్నారు. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ప్రతినిధి గుప్తా మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుంచి చేనేత కారులు, చేతి పని బందాలు తమ సిల్క్ చీరలు, హ్యాండ్లూమ్ డ్రెస్ మెటిరియల్ వంటి 50 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు.