Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐటీ ప్రొఫెసర్ బిష్ సన్యాల్
నవతెలంగాణ-ఓయూ
ఎంఐటీ-హార్వర్డ్, మెసాచుసెట్స్ భారత్‌లో చేపడుతున్న పరిశోధనా ప్రాజెక్టుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిష్టాత్మక ఎంఐటీ ప్రొఫెసర్ బిష్ సన్యాల్ అన్నారు. అమెరికా పర్యటన భాగంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ ఎంఐటీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొ.బిష్ సన్యాలు పరస్పర సహకారంతో పనిచేద్దామన్న ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం హార్వర్డ్‌లోని సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హితేష్ హాథీతో భేటీ అయ్యారు. భారత్‌లో చేస్తున్న పరిశోధనా ప్రాజెక్టుల్లో ఉస్మానియా విద్యార్థి పరిశోధకుల సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంఐటీలో ఓయూ పూర్వవిద్యార్థి డాక్టర్ మహేందర్ దేవల్ స్థాపించిన సాంకేతికత విస్తరణ సంస్థను పూర్వవిద్యార్థులతో కలిసి వీసీ రవీందర్ యాదవ్ సందర్శించారు.