Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్, ఇంద్ర సింగ్ నగర్, వాణి నగర్లలో మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరీష్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర నగర్లో కమిటీ హాల్ ఏర్పాటు, నాలా పూడికతీత పనులు , వర్షపునీరు నాలా లోనికి సాఫీగా వెళ్లేలా చర్యలు , మిగిలిన సీసీ రోడ్లు , మంచినీటి కాలుష్యంపై చర్యలు ఓపెన్ ల్యాండ్ లో వ్యర్థ పదార్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కాలనీల ప్రజలు ఎమ్మెల్యే దష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న అధికారులకు వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మంగతాయారు , వాటర్ వర్క్స్ డీజీఎం రాజేష్, డీఈ ప్రశాంతి, నోడల్ ఆఫీసర్ సురేందర్ నాయక్, వాటర్ వర్క్స్ మేనేజర్ శివప్రసాద్, ఎస్.ఎస్.రాము , కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగ దీప్ గౌడ్, సీనియర్ నాయకులు సోమేశ్ యాదవ్ , సత్తిరెడ్డి, మధు, మనోహర్, జ్ఞానేశ్వర్, మల్లేశం, కుమార్, అజరు, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్యనారాయణ, సత్తయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలో 8 డివిజన్లకు చెందిన 346 మంది లబ్దిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.3 కోట్ల, 46 లక్షల 40 వేల 136/- రూయాల విలువచేసే చెక్కులను చింతల్లోని తన కార్యాలయంలో పంపిణీ చేశారు.