Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
పోటీ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులు కేవలం చదవటంతో సరిపోదని విశ్లేషణాత్మక అధ్యయనం ముఖ్యమని పోటీ పరీక్షల నిపుణులు డాక్టర్ రియాజ్ సూచించారు. నగర కేంద్ర గ్రంథాలయంలోని సమావేశ మందిరంలో గోల్కొండ అకాడమీ నిర్వహణలో బెల్లంకొండ సైదులు రచించిన తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ. గ్రంథóం, చారీస్ ఇంగ్లీష్ గ్రామర్ ఆంగ్ల సంపుటిల ఆవిష్కరణల సభ జరిగింది. ముఖ్య అతిథిóగా డాక్టర్ రియాజ్ గ్రంథాలను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో విశేషాలు రాష్ట్ర ఆవిర్భావంకు దారితీసిన పరిణామాలు సోదాహరణంగా గ్రంథóంలో రచయిత సైదులు వివరించారని, అన్ని పోటీ పరీక్షల అభ్యర్థులకు అవసరమైన సమాచారం గ్రంథóంలో ఉన్నాయన్నారు.. ఇంటలిజెన్స్ సీఐ వీర బాహు, వెంకట్, ఉపేంద్ర, భాస్కర్ పాల్గొన్నారు.