Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీపీఎస్ కాలాడేరా పాఠశాలలో నెల రోజులుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచుకొండ ఫౌండేషన్ ట్రస్టీ వరుణ్ కుమార్ హాజరయ్యారు. సమ్మర్ క్యాంప్‌లో కుట్లు అల్లికలు నేర్చుకున్న విద్యార్థులు వారి నైపుణ్యంతో తయారు చేసిన కొన్నిరకాల వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, కూచిపూడి, జానపదం, కోలాటం, పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం విద్యార్థులు వేసవి శిక్షణ క్యాంప్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నారనీ, వచ్చే విద్యాసంవత్సరం ఇదే విధంగా పిల్లలు ఇంకా బాగా సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందడి వెంకట రెడ్డి మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్‌కు సహకరించిన మంచుకొండ ఫౌండేషన్ చైర్మెన్ ప్రకాశం కు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి తల్లిదండ్రులను సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అమ్మాజీ, జయలక్ష్మి, సుజాత, నిర్మల, రేష్మ, హృదయ, మేరీ, బాలభవన్ సూపరిండెంట్ విజయలక్ష్మి, మంచుకొండ కో-ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.