Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దళిత బంధుతో కొత్త వెలుగులు పేద దళితుల్లో కొత్త జీవితాలు ప్రసాదించేందుకు దేశంలోనే తొలిసారిగా దళిత బంధు పథóకాన్ని ముఖ్యమంత్రి కేసీిఆర్ ప్రవేశపెట్టారని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. సికింద్రా బాద్ పరిధిలో దళిత బంధు పథóకం అమలును పద్మారావు గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని వివరించారు. 25 మంది లబ్దిదారులకు వాహనాలను ఈ సందర్భంగా అందించారు. జిల్లా కలెక్టర్ శ్రమన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామలహేమ, కంది శైలజ, కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, నేతలు కంది. నారాయణ, కరాటే రాజు, రాజ సుందర్, జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి ప్రారంభం
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారుల బందాలు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫలమండి, బౌద్ధనగర్ డివిజన్ల పరిధుల్లో 121 బస్తీలు, కాలనీల్లో రానున్న 15 రోజుల పాటు పర్యటిస్తాయని తీగుల్ల పద్మారావుగౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పద్మారావుగౌడ్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. సితాఫలమండీలో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావుగౌడ్ మాట్లాడుతూ గతంలో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో 9కోట్ల రూపాయలకు పైగా పనులను చేపట్టామని తెలిపారు.
ప్రతి ప్రాంతాన్ని సందర్శించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని అయన అధికారులను ఆదేశించారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, కంది శైలజ, డిప్యూటీ కమిషనర్ దశరద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ గౌడ్, ఆశలత, డిప్యూటీ జీఎం వై.కష్ణతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.