Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్
కరోనా కష్టకాలంలో ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదుకోవాల్సిందిపోయి. వివక్ష చూపడం తగదని, చాలా ఇబ్బందులు పడుతున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ట్రాస్మా అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి సోమశేఖర్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుత్బు ల్లాపూర్ నియోజకవర్గంలోని ట్రాస్మా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2019 నుండి పాఠశాల బస్సులు నడవనప్పటికీ బుధవారం ఫిట్నెస్కి వెళ్తే రోజుకు యాభై రూపాయల చొప్పున బస్సుపైన 30వేల రూపాయల పెనాల్టీ విధించడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కష్టతరంగా అప్పులు తీసుకువచ్చి చాలా భారంతో నడపాల్సివస్తుందని ఇదే కాకుండా ప్రాపర్టీ టాక్స్‌లు కూడా తగ్గించాల్సింది పోయి రుసుముతో వసూలు చేస్తున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రావాల్సినవి ముక్కు పిండి ఫైన్‌తోపాటు వసూలు చేస్తున్నారని.. విద్యా సంస్థలకు నామమాత్రం చెల్లింపులు మాత్రం చెల్లించడంలేదని. ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి ఉపాధ్యాయులకు రావలసిన డబ్బులు వెంటనే విడుదల చేసి ప్రైవేట్ స్కూల్ బస్సులపై పెంచిన టువంటి పెనాల్టీలు, ప్రాపర్టీ టాక్స్ పెనాల్టీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ట్రస్మా ప్రతినిధులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.