Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
భారత దేశంలో అతిపెద్ద బంగారు వజ్రాభర ణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్, డైమండ్స్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థినులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్షిప్పులు అందించారు. శ్రేయోభిలాషులు, కస్టమర్లు మరియు మేనేజ్మెంట్ టీమ్ సభ్యుల సమక్షంలో, షోరూమ్ పదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, ప్రేమ్ మహేశ్వర్లు హాజరు అయ్యారు. 217 మంది విద్యార్థులకు దాదాపు రూ.16,14,000 స్కాలర్షిప్పులు మొత్తాన్ని అందజే శారు. ఈ కార్యక్రమంలో మొత్తం 217మంది విద్యార్థులకు చెక్కులను అందజేయగా, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి రూ.6,000 నుండి 10,000 వరకు స్కాలర్షిప్పులు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూపు ప్రకటించింది. మలబార్ గ్రూప్ నిబద్ధతలో భాగంగా, సామాజిక సేవ కార్యక్రమాలకు, దాతత్వ కార్యక లాపాలకు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5 శాతం ఈ ప్రాంతంలో ఖర్చుపెడుతుంది. మలబార్ గ్రూపు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా గహ నిర్మాణం, వైద్య సహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, విద్య రంగాల్లో దష్టిసారిస్తుంది అని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మలబార్ స్టోర్ హెడ్ రధీశ్, మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.