Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క
- భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు
నవతెలంగాణ-హైదరాబాద్
బండి సంజయ్ పుట్టక ముందు నుంచే కాంగ్రెస్ నాయకులు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, సీఎల్పీ నేతన భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనో బారి నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆయనతోపాటు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు అధ్వర్యంలో చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా ఆరోగ్యం బాగుం డాలని పూజలు నిర్వహిస్తామన్నారు. బండి సంజరు చేసిన వాఖ్యలు హాస్యాస్పదమనీ, భాగ్యలక్ష్మి ఆలయంను సంజరుకి ఏం రాసివ్వలేదనీ, ఆయన జాగీరు కాద న్నారు. వీహెచ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం రోజు సోనియాకి కరోనా రావడం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారనీ, త్వరగా కోలుకోవాలని పూజలు చేసినట్టు వెల్లడించారు. ఆలయాల పేరిట రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్, ఏఐసీసీ కార్య దర్శి జి.చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు జి.నిరంజన్, రాములు నాయక్, అనిల్ యాదవ్, వెంకటేష్, ఎస్.పి. క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
బేగంపేట : ఇటీవల కరోనా మహమ్మారి భారిన పడిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరగా కోలుకో వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి కోరుకు న్నారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహంకాళి ఆలయంలో కొందరు పనిగట్టుకుని రాజకీ యాలు చేస్తున్నారని అన్న మంత్రి తలసాని వ్యాఖ్యలను ఖండించారు. తలసాని బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆదేశాల ప్రకారమే నూతన విగ్రహం ఏర్పాటు చేశామని ఆలయ ఈఓ కమిషనర్‌కు లెటర్ రాయడం, మంత్రి తలసానికి తెలి యదా అని ప్రశ్నించారు. తాను ఏ పని చేసినా పక్క సమాచారం, ఆధారాలతోనే చేస్తాననీ, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తే ఉరుకోమని హెచ్చరించారు.
హైదరాబాద్ : కొవిడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ త్వరగా కోలుకోవాలని పాతనగర హరిబౌలిలోని చారిత్రాత్మకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆల యంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్.పి.క్రాంతి కుమార్ అధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.దినేష్, ఎం.శ్రీనివాస్, జి.నవీన్ కుమార్, అర్.శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.