Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయినపల్లి క్రీడా మైదానంలో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరో సీనియర్ జాతీయ స్థాయి ఫెస్టివల్ ఛాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు సెమీఫైనల్ ఫొటీలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు హాజరై ప్రారంభించారు. సెమి ఫైనల్ బాలుర విభాగంలో పుదుచ్చేరి జట్టుపై హిమాచల్ ప్రదేశ్ గెలుపొందింది. తమిళనాడు తెలంగాణ జట్ల మధ్య జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ పోరులో తమిళనాడు జట్టు విజయం సాధించింది. ఇక బాలికల విభాగంలో హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ జట్ల మధ్య పోటీ జరుగగా హిమాచల్ ప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు, తెలంగాణ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు విజయం సాధించింది. ఇక మొదటి ఫైనల్ మ్యాచ్ బాలుర విభాగంలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు హౌరా హౌరీ పోరు కొనసాగింది. ఈ పోరులో చివరికి తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ జట్టు రన్నర్ అప్‌గా నిలిచింది. ఇక బాలికల ఫైనల్ మ్యాచ్ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య హౌరా హౌరీగా జరిగింది. హిమాచల్ ప్రదేశ్ విజేతగా నిల్వగా తెలంగాణ జట్టు రన్నర్ అప్‌గా నిలిచింది. బాలుర విభాగం ఛాంపియన్ షిప్ ట్రోఫీ తమిళ్ నాడు జట్టు. బాలికల విభాగంలో హిమాచల్ ప్రదేశ్ జట్లు అందుకున్నారు. కింగ్ ఫిషర్ పాన్ మాసాల ఛైర్మెన్ అభిషేక్ ఆవాల, లయన్స్ క్లబ్ ప్రతినిధి దీపక్ భట్టాచార్య, ఫస్ట్ బాల్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ప్రెసిడెంట్ కరం సింగ్ కర్మ, సెక్రెటరీ బాల వినాయకం, తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ ఛైర్మెన్ జంపన ప్రతాప్, సెక్రెటరీ కిమ్ము వెంకటేష్, బోయినపల్లి సీఐ రవికుమార్ హాజరై విజేత, రన్నర్ అప్ జట్లకు, మూడో స్థానం పొందిన జట్లకు ట్రోఫీలు అందజేశారు.