Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో కాలనీలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలను పరిష్కారం చేయటమే లక్ష్యంగా పనిచేస్తుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. గురువారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 31వ డివిజన్, 20వ డివిజన్లకు సంబంధించిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్ బంగారు అనితా ప్రభాకర్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, ఏఈఈ రాంప్రసాద్‌రెడ్డి, నాయకులు రామోజీ శ్రీశైలంచారి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి
మూసాపేట్ డివిజన్ కబీర్ నగర్ ప్రాంతంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథిóగా మూసాపేట్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్ హాజరై ప్రారంభించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సందేశ్, సీిఓ మురళి, వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రకాష్, బీజేపీ నేతలు మనోహర్, ఎర్రస్వామి, సతీష్‌చారి, మల్లేష్‌గౌడ్, డాకయ్య, రమేష్ నాయర్, నాగరాజు, శోభరాజన్, మాణిక్, నరసింహ, భాస్కర్, నర్సింలు, సాయి.తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్
పట్టణ ప్రగతి కార్యక్రమం శుక్రవారం సుభాష్‌నగర్ 130 డివిజన్ పరిధిలో స్థానిక మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మరియు అధికారులు ప్రారంభించారు. సురేష్ రెడ్డి అధికారులతో కలిసి బస్తీలు, కాలనీలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ పాపమ్మ, హెచ్ఎండబ్ల్యుఎస్ ఏఈ రాజు, హాట్ ప్లానింగ్ అధికారులు ప్రభావతి, ఇన్స్పెక్టర్ స్థానిక నాయకులు యూసుఫ్, జహంగీర్, మన్నన్, నవనాథ్, విజరు తిరుపతి, ఎస్ఎఫ్ఏ శివ, రామ కృష్ణ స్థాయి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు .
కళావతి నగర్లో
పల్లె ప్రగతి కార్యక్రమం సూరారం 129వ డివిజన్ పరిధిలో మొదటగా కళావతి నగర్లో ప్రారంభించి, ఆయా బస్తీలు, కాలనీలలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతిలో ప్రతి సమస్య పరిష్కరించ డానికి కషి చేస్తున్నట్లు డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు గాజులరామారం సర్కిల్ ఉప కమిషనర్ ప్రశాంతి, డీఈ శిరీష, వాటర్‌వర్క్స్ ఏఈ రమ్య, భారతి, రాజేందర్ బాబు, హౌస్ ప్లానింగ్ సంగీత, విద్యుత్ సిబ్బంది, మరియు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్దిక్, స్థానికులు తదితర అధికారులతో పర్యటించారు.
ఓయూ ప్రగతినగర్‌లో
హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్లోని బృందావన్ కాలనీ, స్నేహనగర్ కాలనీ, ఈస్ట్ శ్రీనివాసపురం పర్యటించారు. డివిజన్లోని కాలనీలో చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, నాలాలో తీసిన మట్టిని వెంటనే ఎత్తాలని అధికారులకు తెలిపారు. ఇంకా డివిజన్లోని దీర్ఘకాలిక సమస్యలు ఎవైనా ఉంటే తమ దృష్టికి తేవాలని కాలనీలవాసులను కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్లుఎస్ డీజీఎం రజనీకాంత్, విద్యుత్ ఏఈ రాంరెడ్డి, మున్సిపల్ అధికారులు డీయి నాగమణి, ఏయి కీర్తీశ్రీ, విద్యుత్ ఏయి రాములు, హర్టికల్చరర్ నర్సింగ్, స్థానికులు, బీజేపీ నాయకులు రంగరవి, న్యాలకొండ సుమన్ రావు, ముశిగంపల శివగౌడ్, పాల్గొన్నారు.