Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. ఆయా ప్రాంతాల్లో, కాలనీల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. చెత్తా చెదారాన్ని తొలగింపజేశారు. పలుచోట్ల సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. ఆయా ప్రాంతాల్లో, కాలనీల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. చెత్తా చెదారాన్ని తొలగింపజేశారు. పలుచోట్ల సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి చేపట్టాల్సిన పనులపై చర్చించారు.
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్/బాలానగర్/దుండిగల్/కూకట్పల్లి/
జీడిమెట్ల డివిజన్ పరిధిలో..
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గోదావరి హౌమ్స్ వద్ద ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, పారిశుధ్య పనులు , పార్క్ అభివద్ధి పనులు పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో నాలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటికి నీరుపోసి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మంగతాయారు , వాటర్ వర్క్స్ డీజీఎమ్ రాజేశ్, డీఈ ప్రశాంతి, నోడల్ ఆఫీసర్ సురేష్ నాయక్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎల్విస్, యుబిడి మేనేజర్ అనిల్, వాటర్ వర్క్స్ మేనేజర్ శివప్రసాద్, ఎస్.ఎస్.రాము, లైన్మెన్ కిరణ్ కుమార్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ మాధవరెడ్డి, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్, నరేందర్‌రెడ్డి, నాగేష్, కాలనీ అధ్యక్షులు శ్రీకాంత్, నదీం రారు, సమీర్ సింగ్, సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్ డివిజన్ పరిధిలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులు, నాయకులతో కలిసి కార్పొరేటర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఏఈ రషీద్, నోడల్ అధికారి ఉషారాణి, శానిటేషన్ అధికారి అశ్విని, ఎంఎం స్ఎఫ్ఏ లు, ఎంటమాలజీ కార్మికులతో పాటు స్థానిక బాలానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖాజా, మందడి సుధాకర్ రెడ్డి, ఎలిజాల యాదగిరి, అహ్మద్ హుస్సేన్ (బాబా), పంజా రాంచందర్, మురళీ ముదిరాజ్, సుజాత గౌడ్, మధులత తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్, ఎల్లమ్మ చెరువువద్ద పాదయాత్ర చేపట్టారు. కాలనీ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, నోడల్ ఆఫీసర్ అరుణమ్మ, ఏఈ సుభాష్, సీఓ ముస్తఫా, జవాన్ బుజ్జి, ఎస్ఎఫ్ఏలు మల్లేశ్, వెంకటరమణ, వర్క్ ఇస్పెక్టర్స్ రవీందర్‌రెడ్డి, రవికుమార్, సూపర్వైజర్ శివ, టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ యాదవ్, గుడ్ల శ్రీనివాస్, రాజ్యలక్ష్మి, మధులత, రాములుగౌడ్, బాలస్వామి, అగ్రవాసు, సంగమేష్, బోయ కిషన్, రాజుపటేల్, రవీందర్, షకీల్ మున్నా, జనార్దన్, షేక్ బీబీ, దేవి, రేణుక, పద్మ, మిత్రవింద, ప్రసన్న, శోభ, సాయిగౌడ్, శ్రీను, జనయ్య, తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపల్ పరిధిలో..
ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి తో ప్రజల సమస్యలు తెలుసుకొని మరింత అభివద్ధి చెందే విధంగా సమస్యలను సత్వర పరిష్కారాలు చేపట్టవచ్చని దుండిగల్ మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి కృష్ణ తెలిపారు. గాగిల్లాపూర్ 1వ వార్డు పరిధి ఇతర వార్డులలో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్లు, వార్డు కమిటీ మెంబర్లతో సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లు, ప్రజలు వార్డు పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని చైర్మెన్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రయినేజీ వ్యవస్థ, నూతన అంగన్వాడీ భవన నిర్మాణం, శ్మశాన వాటికను అభివృద్ధి పరచడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.భోగేశ్వర్లు, కౌన్సిలర్ కుంటి అరుణ, 28వ వార్డ్ కౌన్సిలర్ తనుగుండ్ల జోస్పిన్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి 11వ డివిజన్లో..
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ రవికిరణ్ ఆధ్వర్యంలో కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ కోలన్ నీలా గోపాల్‌రెడ్డి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ వంశీ కష్ణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా కాలనీల్లో పర్యటించి డ్రయినేజీ వ్యవస్థ, రోడ్లు, చెత్త తరలింపు, ప్యాచ్ వర్క్ పనులను, ట్రీ గాడ్స్ పనులను పరిశీలించారు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ రామకష్ణ, కేటీఆర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు శేషగిరి, వెంకటేశ్, వైజయంతి మాల, కిషోర్ కుమార్, బాలాజీ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సతీశ్, సతీశ్ రెడ్డి, జలంధర్ రెడ్డి, మహిళా నాయకులు సబితా జలంధర్ రెడ్డి, 12వ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్, టీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము, కాలనీ వాసులు, అధికారులు శ్రీనివాస్, వాటర్ వర్క్స్ డీజీఎం సరిత, సాయిరాంరెడ్డి, డీఈ దాసయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.