Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
సమగ్ర అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహద పడుతుందని, అందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నగరంలో చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమం సంద ర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్ ఎన్బీ టీనగర్లో మేయర్ పాల్గొన్నారు. అధికా రులు, ప్రజలతో కలిసి పలు వీధుల్లో కలియ తిరిగి సమస్యలను అడిగి అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు దేశాలు జారీచేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ముఖ్యమని ప్రజలకు అవగాహన కల్పిం చారు. నిర్మాణ వ్యర్థాలు ఇంటి ముందు ఉండకుండా వెంటనే తొలగించాలని, నిర్మాణ వ్యర్థాలు నోటీసులు జారీ చేసిన పిదప తొలగించని పక్షంలో జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు స్థలంలో ఉన్న వ్యర్థాలు ముళ్ల పొదలని యజమాన్యం తొలగించని పక్షం లో జరిమానా వేసి తొలగిం చాలని అధికారులను ఆదేశిం చారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని కాలనీవాసులకు వివరించారు. పట్టణ ప్రగతి ద్వారా మెరుగైన సేవలతో పాటు అభివృద్ధి ప్రణాళిక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ పట్టణ ప్రగతి, దోమల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై తయారుచేసిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, ఖైరతాబాద్ జోనల్ ఎస్ఈ రత్నాకర్, డీసీ తదితరులు పాల్గొన్నారు.