Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంది
- ఎఫ్‌సీఐ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదిరెడ్డి
నవతెలంగాణ-వనస్థలిపురం
ఎఫ్‌సీఐ కాలనీలో ఫేస్ 1, ఫేస్ 2లు 1982లో ఎఫ్‌సీఐ ఎంప్లాయిస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి దాదాపు 656 ప్లాట్లు అదే రోజు అందరికీ అలాట్మెంట్ చేసి డబ్బులు కూడా పెట్టుకున్నారు. ఫేస్ 1లో 118, ఫేస్ 2లో 100 గజాల ఫ్లాట్‌ను ఆరోజు డ్రైనేజీ సిస్టం లేనందున వదిలివేశారు. చట్ట వ్యతిరేక పనులు సిద్ధపడుతూ ఆ ఫ్లాట్‌ను కూడా సొసైటీ అమ్ముకుని సొమ్ము చేసుకుందని కాలనీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కెఎస్‌వి.దుర్గాప్రసాద్ వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డికి
శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్టీపీిఎన్ ఆచార్యులు, కార్యదర్శి ఆర్.రామ నాథం దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్లాట్లు అన్నీ అమ్ముకున్నా కూడా అదేవిధంగా కొనసాగుతూ 17 ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2008లో జీహెచ్ఎంసీికి ఎల్ఆర్ఎస్కి కూడా అప్లై చేశారు. అందులో ప్లాట్లు ఫేస్ 2లో 172 ప్లాట్లు 350 గజాలు ఎండి పురుషోత్తం అనే పేరు మీద అలాట్ అయింది. దానిని దాదాపు 40 సంవత్సరాల రిజిస్ట్రేషన్ చెయ్యకుండా ఆపి ఎండి పురుషోత్తం కూడా అతని పిల్లలకు కాకుండా 27-01-2022న ఎన్.సుబ్రహ్మ ణ్యం అనే థర్డ్ పార్టీ వ్యక్తిపై (అతనికి బైలాస్కు వ్యతిరేకంగా) డైలాగ్స్‌ను అతిక్రమించి మూడో వ్యక్తికి కట్టబెట్టారు. చట్టరీత్యా నేరం కాబట్టి ఈ హౌసింగ్ సొసైటీని 40 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ, ప్రతిదీ అన్యాక్రాంతం చేసుకుంటూ 450 ఇండ్లు కట్టుకుందాం ఏ ప్లాటు మిగిలి ఉన్నా గాని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రామపంచాయతీ లేఅవుట్ కాబట్టి మిగిలిన ప్లాట్లను అమ్ముకునే అధికారం వీరికి లేదని, కాబట్టి వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాలనీ సంక్షేమ సంఘం తరఫున కార్పోరేటర్ని వినతిపత్రంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిలు కోరారు.