Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ను అభివద్ధి పరుస్తూ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్‌లో శుక్రవారం మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకు లతో కలిసి పాదయాత్రగా వార్డు కార్యాలయం, పోస్ట్ ఆఫీస్, అంగన్ వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మింగా సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివద్ధి చెందుతుందన్నారు. వార్డు కార్యాలయంలో స్థలంలో పార్కు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున అదనపు గదులను నిర్మాణం, లేదా మరో ప్రాంతంలో కొత్త పాఠశాలను నూతనంగా నిర్మించేందుకు తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా అంగన్వాడి కేంద్రంతోపాటు కమ్యూనిటీ భవనంపై అంతస్తు పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌ను తొలగించాలని సూచించి ప్రత్యామ్నాయం చూపాలని తెలిపారు. ఈ కార్యాక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగరాజు యాదవ్, బౌరంపేట్ ప్యాక్స్ చైర్మెన్ మిద్దెల బాల్ రెడ్డి , కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్లు భీంరెడ్డి, సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, మురళి యాదవ్, సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి, గోనె రాంరెడ్డి, జీహెచ్ఎంసీ 125 డివిజన్ పార్టీ అధ్యక్షులు విజరు రామ్‌రెడ్డి, జెమ్మి దేవేందర్, కామేశ్వర్రావు, జీవన్, గోపాల్, సోమరాజు, శ్యామ్, శ్రీకాంత్, రాజిరెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.