Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
- 8 వందల ఎంఎం డ్రయినేజీ పైపులైన్ పనులు ప్రారంభం
- అలీకేఫ్ చౌరస్తా సమీపం నుంచి సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు వరకు పనులు
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట నియోజవకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పైప్లైన్లు శిథిలావస్థకు చేరి స్థానికులను వేదిస్తున్న డ్రయినేజీ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి భవిష్యత్తు తరాలకు అనుగుణంగా పైప్లైన్ల ప్రక్షాళన చేపడుతున్నామని తెలిపారు. శనివారం అంబర్‌పేట డివిజన్ అలీకేఫ్ చౌరస్తా సమీపం నుంచి సీవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 వందల ఎంఎం డ్రయినేజీ పైప్లైన్ల పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజవకర్గంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు అభివద్ధి పనులను వేగవంతం చేశామన్నారు. ఎంతో కాలంగా అభివద్ధికి నోచుకోని బస్తీల రూపురేకలను మార్చి ఎలాంటి సమస్యలు లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అంబర్‌పేట డివిజన్లోని పాతపటేల్ నగర్, నరేంద్రనగర్, ప్రేమ్‌నగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్డు, డ్రయినేజీ, మంచినీటి పైప్లైన్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం ప్రేమ్‌నగర్‌లోని పలు బస్తీల్లో ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజలను పలకరిస్తూ సమస్యల గురించి ఆరా తీశారు. తన దష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, అమునూరి సతీష్, లింగారావు, శ్రీనివాస్ గుప్తా, మహేష్ ముదిరాజ్, సంతోష్‌చారి, లలిత, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, ఏఎంహెచ్ఓ జ్యోతి పాల్గొన్నారు.