Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
తెలంగాణ జన సమితి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో శనివారం అల్వాల్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళ్లర్పించి తెలంగాణ ఆత్మగౌరవ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భద్రగమ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్‌ను యాది చేసుకు ంటూ తెలంగాణ ఉద్యమంలో అల్వాల్ ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు దీక్ష చేపట్టినట్టు గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందనీ, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయడంలో మల్కాజి గిరి ప్రాంత వాసులు ముందుండి ఉద్యమం చేసినట్టు తెలిపారు. తెలంగాణలో ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అదే దిశగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తెలంగాణ జన సమితి ఉద్యమం చేస్తుందన్నారు. ఈ నెల 6న నిర్వ హించనున్ను తెలంగాణ ఆత్మగౌరవ దీక్ష సభను విజయవ ంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజరు కుమార్, విజరు రాజు, రవి పాల్గొన్నారు.