Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
త్వరలో వెయ్యి మంది లబ్దిదారులను దళితబంధు కింద ఎంపిక చేస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. శనివారం ముషీరాబాద్ నియోజక వర్గం గాంధీనగర్‌లోని బాడ్మింటన్ స్టేడియంలో లబ్దిదా రులకు వాహనాలను పంపిణీ చేశారు. 22 మందికి కార్లు, ఆటో ట్రాలీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వాలూ ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వచ్చినప్పుడే ఆ పథకం విజయవంతమైనట్టు అని తెలిపారు. లబ్దిదారులు తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పరచుకోవడమేగాక ఇతరులకు కూడా ఆర్థికంగా తోడ్పడే అవాకాశం ఏర్పడుతుందని చెప్పారు. లబ్దిదారులు అభి వృద్ధి చెందితేనే సీఎం సంతోషిస్తారని చెప్పారు. ముషీరా బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఎన్ని రోజుల నుంచో ఎదురుచూస్తున్నామనీ, ఈ రోజు ముషీరాబాద్‌లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దళితబంధు వంటి పథకం దేశంలో ఎక్కడా లేదనీ, దళితులందరినీ ఆర్థికంగాపైకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన గొప్ప పథకమన్నారు. వాహనామో లేదా వ్యాపారమో ప్రారంభించుకోవడానికి లబ్దిదారులకే అవకాశం ఇచ్చామన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.