Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-అంబర్‌పేట/అడిక్‌మెట్
స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి కార్యక్రమమని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం గోల్నాకలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి పాల్గొని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కారం అయ్యాయని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నాలాల సమగ్ర అభివద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నాలాల అభివృద్ధి పనులతో పాటు నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నామని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించిన ఘనత కుశీఏసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ డాక్టర్ శిరీష యాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, మోర శ్రీ రాములు ముదిరాజ్, కొమ్ము శ్రీనివాస్, చందు, రవీందర్ యాదవ్, అనిల్. మధుసూదన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సంతోషమే లక్ష్యంగా..
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయం అని పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీ నగర్ డివిజన్లోని అరుంధతి నగర్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పర్యటించి స్థానిక నాలాను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్డు, నాలా వెంట ఉన్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ప్రజల కోరికను పరిశీలిస్తున్నా మన్నారు. ఈ కమిటీ హాల్ స్థలం కోర్టు వివాదంలో ఉన్న కారణంగా సమస్యను పరిష్కరించి అభివద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయంతో పని చేస్తున్నారన్నారు. ముషీరాబాద్‌లో అభివద్ధి ముందడుగులో ఉందన్నారు అత్యధిక నిధులు కేటాయిస్తూ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మని తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జై సింహ, అధికారులు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎంసీ హరికష్ణ, వాటర్‌వర్క్స్ డీజీఎం సుబ్బరాయుడు, ఏఎమ్ఓహెచ్ మైత్రి, డీజీఎం చంద్రశేఖర్, డీఈ సన్నీ, తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్ తదితరులు.