Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-ఓయూ
మట్టి లేకుండా మనుగడ లేదని, నాణ్యమైన ప్రకతి వనరులను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐసీఎస్ఎస్ఆర్, ఈఎంఆర్ సీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన 'సేవ్ సాయిల్' రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవ్ సాయిల్ పేరుతో ప్రజల్లో పర్వావరణం పట్ల మరింత విస్తత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని రిజిస్ట్రార్ అభిప్రాయపడ్డారు. అన్ని విభాగాలను సమన్వయం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ మణాళిని కషిని ఈ సందర్భంగా అభినందించారు. అభివద్ధి పేరుతో సహజత్వాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కోల్పోయిన సారం తిరిగి పూర్వస్థితికి రావాలంటే వందల సంవత్సరాలు పడుతుందని... అలాంటి ప్రమాదం రాకుండా ముందే మేల్కొని మట్టి సారాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆజాదీకా అమత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఐసీఎస్ఎస్ఆర్, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈఎంఆర్సీతో కలిసి సంయుక్తంగా నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సమన్వయకర్త, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొ. మణాళిని తెలిపారు. ఇప్పటికే మూడు రోజుల పాటు యోగాకు సంబంధించిన ప్రాథమిక శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన సహా ఇతర పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. జాన్ 21న పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొ. రామకష్ణ, ప్రొఫెసర్ మూర్తి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యమ్మ, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ కష్ణయ్య, డాక్టర్ మధుకర్, విశ్రాంత ఆచార్యులు, ఇషా ఫౌండేషన్ కార్యకకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.