Authorization
Wed April 16, 2025 06:45:02 am
- ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి భారీ ఊరట
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఉక్కపోతతో విలవిలాడుతున్న నగరవాసులకు కాస్త రిలీఫ్ చేసింది. ఉదయం నుంచి ఎండవేడితో ఉక్కిరి బిక్కిరైన ప్రజలు సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్మెట్ మల్కాజిగిరి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లిలో వర్షం కురిసింది. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏరియా వర్షం (సెంటిమీటర్లలో)
అల్వాల్ 2.0
మారెడుపల్లి 1.9
మల్కాజిగిరి 0.95
తిరుమలగిరి 0.93
కాప్రా 0.58
ఉప్పల్ 0.45
హయత్‌నగర్ 0.38
సికింద్రాబాద్ 0.25