Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మల్కాజిగిరి తహస ీల్దార్ వినయ లతకి వినతి పత్రం అందజేసినట్టు సీపీఐ (ఎం) నేరెడ్మెట్ డివిజన్ కమిటీ కన్వీనర్ బంగారు నర్సింగరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మల్కా జిగిరి మండల కార్యదర్శి ఎం.కృపాసాగర్ పాల్గొని మాటా ్లడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీనిచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ప్రభు త్వం స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖా స్తులు చేసుకున్న లబ్దిదారులను గుర్తించి, సమగ్రమైన సర్వే నిర్వహించి త్వరితగతిన అందజేయాలని కోరారు. లేనిపక్షంలో దరఖాస్తు దారులతో నిర్మాణంలో ఉన్న ఇండ్ల ను ఆక్రమించి అర్హులైన పేదలకు పంచుతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) డివిజన్ నాయకులు వైష్ణవి, ఈ.సుమిత్ర, కె.పద్మ, సునంద, ఎస్.నాగమణి, దీపిక, లతా మంజుల, కవిత, భారతమ్మ పాల్గొన్నారు.